నేటి కాలంలో ప్రేమ వ్యవహారాల కారణంగా చాలా వివాహాలు విచ్ఛిన్నమయ్యాయనే వార్తలు వస్తున్నాయి. అయితే.. ఛత్తీస్‌గఢ్ లోని కొండగావ్ జిల్లాలో మాత్రం ఒక ప్రత్యేకమైన వివాహం జరిగింది. ఓ యువకుడు తన ఇద్దరు ప్రియురాళ్లను ఒకే మండపంలో పెళ్లి చేసుకొని అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇందులో విచిత్రం ఏముందనుకుంటున్నారా..? అసలు కథ అందులోనే ఉంది. వరుని పక్కన పక్కన పీటల మీదు కూర్చున్న వధువులిద్దరు చెరో పాపతో ఉన్నారు.
అయితే.. బంధుమిత్రులే కాదు.. ఇద్దరు భార్యలకు పుట్టిన ఇద్దరు కూతుళ్ల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. శుభలేఖలో వరుడి పేరు కింద వధువుల ఇద్దరూ పేర్లూ రాయడం గమనార్హం. ఈ వివాహం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఛత్తీస్‌గఢ్ లోని కొండగావ్ కు సమీపంలోని ఉమ్లా గ్రామానికి చెందిన రాజన్ సింగ్ కు కొద్ది రోజుల క్రితం అడెంగా గ్రామానికి చెందిన దుర్గేశ్వరి మార్కంతో నిశ్ఛితార్థం జరిగింది. కానీ.. వివాహం కాకముందే ఇద్దరూ ఒకే ఇంట్లో నివసించారు. కొన్ని నెలల తర్వాత దుర్గేశ్వరి గర్భం దాల్చి ఒక కుమార్తెకు జన్మనిచ్చింది.
అదే సమయంలో రాజన్ సింగ్.. అన్వారీ కి చెందిన సన్నో బాయి అనే యువతితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త.. ప్రేమగా మారింది. ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు రాజన్. ఫలితంగా ఆమె కూడా గర్భం దాల్చింది. ఇటీవల ఆమె కూడా ఓ కుమార్తెకు జన్మనిచ్చింది. ఈ విషయం బయటపడడంతో గ్రామంలో కలకలం మొదలైంది.
గ్రామపెద్దల సమక్షంలో ఇరువురు ప్రియుళ్లతో పంచాయతీ పెట్టారు. ఆ ఇద్దరు యువతులు రాజన్ సింగ్ ను వివాహం చేసుకోవడానికి అంగీకరించారు. అందుకు ఇద్దరు యువతులు, వరుడి కుంటుంబ సభ్యులు అంగీకరించడంతో రాజన్ సింగ్ ఒకే మండపంలో ఇద్దరమ్మాయిలను పెళ్లి చేసుకున్నాడు. దుర్గేశ్వరి, సన్నోబాయి తమ తమ కూతుళ్లతోనే పీటల మీద కూర్చొని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపైన స్పందిస్తున్న నెటిజన్లు ఆయ్యగారే నంబర్ వన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.