చేనుకు బలం ఇవ్వడం కోసం రైతులు ఎరువులు వేస్తారు. చీడపురుగులు చేరుకుండా పెస్టిసైడ్స్ కొడతారు. దిష్టి తగలకుండా దిగుబడిరావడం కోసం గడ్డిబొమ్మలు పెడుతుంటారు. అయితే మెహబూబాబాద్ జిల్లా, కే.సముద్రం మండలం భవానీగడ్డ రైతు మాత్రం ఈ దిష్టికి కాస్త అభిమానాన్ని జోడించాడు. మిర్చీ చేనులో దిష్టి బొమ్మకు బదులు తన అభిమాన నటి, స్పైసీబ్యూటీ ఛార్మి సెక్సీస్టిల్ ని పెట్టాడు.పాపం! ఒకప్పటి చక్కని చుక్క, ప్రస్తుతం మిర్చీ చేనుకి దిష్టిచుక్కగా మారిపోయింది. దీంతో చేనుని చూసేకళ్ళన్ని ఛార్మి అందాలని చూస్తూ ఆగిపోతున్నాయి.
భూక్యా అచ్చు అనే రైతు తన రెండు ఎకరాలలో ఎకరం పత్తి, మరో ఎకరం మిర్చి పంటను సాగు చేసుకుంటూ..తన పంటకు దిష్టి తగలకుండా మాస్, రాఖీ సినిమాలతో మాస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న హీరోయిన్ మరియు నిర్మాత ఛార్మి ఈ రైతు అభిమాన హీరోయిన్ కావడంతో ఛార్మి ఫ్లెక్సీని తన పంటపొలంలో ఏర్పాటు చేశాడు.
ఇలా ఛార్మిని చూసుకుంటూ పంటపండించడం,దిగుబడి రావడం తనకు చాలా ఆనందంగా ఉందంటున్నాడు భూక్యా. ఛార్మి, పూరీ అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దర్శకుడిగా బిజీగా ఉన్నపూరికి సన్నిహితురాలిగా, సలహాదారుగా, సహనిర్మాతగా చేదోడువాదోడుగా ఉన్న ఛార్మీ. ప్రత్యక్షంగా పూరికి, పరోక్షంగా సదరు రైటుమిర్చీపంటకు సేవచేస్తుందన్నమాట. భక్తుడికోసం దిగిరావడం దేవుడికే తప్పలేదు, అభిమానికోసం ఛార్మీకి తప్పుతుందాం అంటున్నారు చుట్టుపక్కల రైతులు.