పిల్లిని కాలితో తన్నిన వ్యక్తికి 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఈ ఘటన గ్రీస్ దేశంలో జరిగింది. ఎవియా దీవిలో సముద్రాన్ని ఆనుకొని.. ఓ ఔట్‌డోర్ డైనింగ్ రెస్టారెంట్ ఉంది. అందులో కొన్ని పిల్లులు క్యాజువల్‌గా తిరుగుతుంటాయి. సముద్ర అందాలను చూస్తూ.. చల్లటి గాలులు వీస్తుండగా భోజనం చేస్తూ.. పిల్లలకు కూడా ఆహారం పెడుతుంటారు పర్యాటకులు. అయితే.. అదే రెస్టారెంట్ కు వచ్చిన ముగ్గురు పర్యాటకులు వచ్చారు.
వారు కూర్చున్న టేబుల్ దగ్గరకు రెండు పిల్లులు వచ్చాయి. వాటిలో ఓ పిల్లికి చేపను ఆశచూపాడు ఓ పర్యాటకుడు. చేప కోసం ఆ పిల్లి అతని దగ్గరకు వచ్చింది. పిల్లికి చేప అందకుండా చేస్తూ చేస్తూ.. సడెన్‌గా తన కాలితో పిల్లిని గట్టిగా తన్నాడు. ఆ పిల్లి ఎగిరి సముద్రంలో పడింది. ఆ తర్వాత మరో పిల్లికి కూడా చేపను ఆశ చూపి.. ఆ చేపను సముద్రంలోకి విసిరేశాడు. భయపడిన ఆ పిల్లి పారిపోయింది.
గమనించిన స్థానికులు సముద్రంలో పడిన పిల్లిని బయటకు తీశారు. అందుకు సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియా మీడియాలో వైరల్ గా మారింది. అది చూసిన నెటిజన్లు అతన్ని పిల్లిని కాలితో తన్నిన వ్యక్తిని శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఓ నెటిజన్ అందించిన సమాచారంతో విషయం తెలుసుకున్న గ్రీస్ పోలీసులు.. అతన్ని కనిపెట్టి అరెస్టు చేశారు. గ్రీస్ చట్టాల ప్రకారం అతనికి 10 ఏళ్ల జైలు శిక్ష పడొచ్చని అంటున్నారు. అంతేకాదు రూ.40 లక్షల జరిమానా కూడా విధించే అవకాశం ఉంది అంటున్నారు.