సాధారణంగా ఒక ఇంట్లో కలిసి పెరిగిన అక్కాచెల్లెళ్లు అన్నీ షేర్ చేసుకోవడం కామనే. కానీ.. భర్త విషయంలో మాత్రం అది కుదరని పని. అయితే.. కాంగోలో మాత్రం అది జరిగింది. ఒకేరోజు ముగ్గురు ఓ వ్యక్తిని పెళ్లాడారు.
సౌత్ కివులోని కలేహేలో నటాషా, నటాలీ, నాడేగే అనే ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. వీరిలో నటాలీ.. లువిజో అనే వ్యక్తిని ప్రేమించింది. అయితే.. ఓరోజు తమను పెళ్లి చేసుకోవాలని ముగ్గురూ అతడికి చెప్పారు. దీంతో షాకయ్యాడు. కానీ.. తమను పెళ్లి చేసుకోమని వారు చెప్పిన కారణాల్ని విని కన్విన్స్ అయ్యాడు. చివరకు ఓకే చెప్పేశాడు.
ఈ పెళ్లికి లువిజో కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. అయినా కూడా పెద్దలను ఎదిరించి ముగ్గురు చేతులకు రింగులు తొడిగేశాడు. తనకు చాలా సంతోషంగా ఉందని.. ప్రేమకు పరిమితులు లేవని చెప్పాడు.
సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వివాహ తంతు ఘనంగా జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.