రాజస్థాన్ లో ఓ మోడల్ ఆత్మాహత్యా యత్నం కలకలం రేపింది. జోధ్ పూర్ లోని రాజ్ హోటల్ పై అంతస్తు నుంచి గున్ గున్ ఉపాధ్యాయ అనే మోడల్ కిందకు దూకింది. అయితే ఆమె ఆత్మహత్యకు కారణం హనీట్రాప్ అని తెలుస్తోంది. రాజస్థాన్ కు చెందిన ఓ మినిస్టర్ ను లోబర్చుకునేందుకు కొందరు వ్యక్తులు ఆమెతో బలవంతంగా హనీ ట్రాప్ చేసేందుకు ప్రయత్నించారు.
ఆమె స్నానం చేస్తుండగా వీడియోలను చిత్రీకరించి, ఆమెను భయపెట్టారు. మంత్రిని హనీ ట్రాప్ చేయాలని, లేదంటే ఆ వీడియోను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. వారి ఒత్తిడి తట్టుకోలేక గున్ గున్ ఉపాధ్యాయ హోటల్ పై నుంచి కిందకు దూకింది.
ఈ వ్యవహారంలో ఆమెను బెదిరించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. పెండింగ్లో ఉన్న కొన్ని ఫైళ్లను క్లియర్ చేసుకునేందుకు మోడల్ తో మంత్రిని లొంగదీసుకోవాలని భావించినట్టు నిందితులు విచారణలో తెలిపారు.
మరోవైపు ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని… డిప్యూటీ సీపీ భువన్ భూషణ్ యాదవ్ పేర్కొన్నారు.