చైనా రోవర్ యుటు-2 చంద్రుడి ఉపరితలంపై ఓ నిర్మాణాన్ని గుర్తించింది. క్యూబ్ ఆకారంలో ఉన్న దాన్ని మిస్టరీ హట్ గా చెబుతోంది. చందమామపై వాన్ కర్మాన్ బిలంలో మట్టి నమూనాలు సేకరిస్తున్న సమయంలో అక్కడి నుంచి 80 మీటర్ల దూరంలో ఈ నిర్మాణం కనిపించిందట.
నవంబర్ లోనే దీన్ని గుర్తించిన చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్… ఇది గ్రహాంతరవాసులు కట్టిన ఇల్లా.. లేక చంద్రుడిపై పరిశోధనలకు ఇంతకుముందు ఎవరైనా పంపిన స్పేస్ క్రాఫ్టా అనేది పరిశోధిస్తున్నట్లు తెలిపింది. ఆండ్రూ జోన్స్ అనే జర్నలిస్ట్ చంద్రుడిపై ఆ మిస్టరీ నిర్మాణానికి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. దీంతో అవికాస్తా వైరల్ అవుతున్నాయి.