ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై ఆరోపణల వ్యవహారంలో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఆరిజన్ డెయిరీ నిర్వాహకులు ఆది నారాయణ ఇంకా శైలజ పైనే తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గేదెల యూనిట్లు, ఇన్సూరెన్స్, ఉద్యోగాల కల్పన, డెయిరీ యూనిట్ల ఏర్పాట్ల పేరుతో వీరిద్దరు పలు మోసాలకు పాల్పడినట్టుగా బాధితలు మీడియా సమావేశంలో చెప్పారు.
మోసం చేసి తమ దగ్గర్నుంచి డబ్బులు తీసుకున్నారని.. ఇక డబ్బులు తిరిగి అడిగితే మాత్రం బెదిరింపులకు ఆది నారాయణతో పాటు శైలజ అనే మహిళ కూడా దౌర్జన్యానికి దిగుతుందని బాధితులు వాపోయారు. దీంతో పాటు ఆదినారాయణ పై రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు కేసులున్నాయని కూడా పోలీసుల విచారణలో బయటపడింది.
అయితే ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై శైలజ తీవ్ర ఆరోపణలు చేసిన తరువాత ఇవన్నీ బయటపడడం చర్చనీయాంశంగా మారింది. శైలజ మాత్రం దుర్గం చిన్నయ్య డెయిరీ ఫామ్ కోసం ల్యాండ్ ను ఇప్పిస్తానని మోసం చేశాడని.. డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్ చేయలేదని ఆరోపించారు. అంతే కాదు దుర్గం చిన్నయ్య అమ్మాయిలను పంపాలంటూ బ్లాక్ మెయిల్ కు దిగడంతో.. అమ్మాయిలను ఎమ్మెల్యే క్వార్టర్స్ కు పంపించినట్టుగా కూడా ఆమె చెప్పింది.
అయితే వాటికి సంబంధించి స్ర్కీన్ షాట్స్ తో పాటు.. శైలజ వాయిస్ రికార్డ్ కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. దీంతో సీరియస్ అయిన బీఆర్ఎస్ హైకమాండ్ దుర్గం చిన్నయ్య పై ఇన్వెష్టిగేషన్ రిపోర్ట్ కు ఆదేశించింది. అయితే దుర్గం చిన్నయ్య మాత్రం ఆదినారాయణ ఇంకా శైజలు రైతులను మోసం చేశారని.. వారి తరపున నిలదీస్తేనే.. నా పై దుష్ప్రచారం చేస్తున్నారని చెబుతున్నారు.