సర్వోమ్యాక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కేసులో ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. సంస్థ ఎండీ అవసరాల వెంకటేశ్వరరావును ప్రధాన నిందితుడుగా భావించి కస్టడికి తీసుకున్నారు ఈడీ అధికారులు. అందుకు సంబంధించిన వివరాలను అతని నుండి సేకరిస్తున్నట్టు సమాచారం.
నిందితున్ని ఈడీ కోర్ట్ లో హాజరు పరిచారు అధికారులు. విచారణ కోసం నిందితున్ని తమ కష్టడీకి అప్పగించాలని ఈడీ అధికారులు కోర్ట్ ను కోరారు. స్పందించిన కోర్ట్ నిందితున్ని నాలుగు రోజుల ఈడీ కస్టడీకి అనుమతించింది.
402 కోట్ల మేరకు బ్యాంక్ రుణాల పేరుతో భారీ మోసం చేసిన కేసులో నిందితుడు వెంకటేశ్వరరావుపై ఆరోపణలు ఉన్నాయి. దీనిపై 2018లో సీబీఐ విచారణ చేపట్టింది. అందుకు సంబంధించిన నివేదికను ఈడీకి అప్పగించింది సీబీఐ. ఆ కేసు ఆధారంగా ఈడీ.. మణీలాండరింగ్ పై దర్యాప్తు చేపట్టింది.
బ్యాంకు రుణాలను బినామీ కంపెనీలకు తరలించినట్టు అప్పటి విచారణలో తేలింది. పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేసిన ఈబీ.. మణీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టింది.