– చైనాలో వింత భయం
– కొరియా సరిహద్దు డాండోంగ్ లో..!
ఆ నది వైపు ఉన్నమీ కిటికీలు తక్షణం మూసేయండి. ఆ కిటికీల్లో నుంచి కరోనా రావచ్చు అంటూ చైనా ప్రభుత్వం డాండోంగ్ నగరవాసులను హెచ్చరించింది. ఇప్పటిదాకా కరోనా ఫ్రీగా ఉన్నడాండోంగ్ లో ఉన్నట్టుండి కరోనా కేసులు నమోదు కావటం.. అవి రోజురోజుకూ పెరుగుతుండటంతో చైనా ప్రభుత్వం కలవరపడుతోంది.
ఇన్నిలాక్ డౌన్ లు పెట్టినా..జాగ్రత్తలు తీసుకుంటున్నాకరోనా ఎలా వస్తోందని ..తలలు బద్దలు కొట్టుకున్న వైద్యాధికారులు ఆఖరికి .. పక్కనే ఉన్న ఉత్తర కొరియా నుంచే కరోనా వస్తోందనే అంచనాకు వచ్చారు. అంతే.. డాండోంగ్ ను కొరియాలోని మరో నగరాన్నివేరు చేస్తున్న యలు నది సరిహద్దుల్లో నివసించే వారిని అప్రమత్తం చేశారు.
ఆ నదికి ఆవల ఉన్నఉత్తర కొరియా నుంచి వీస్తున్నగాలుల్లో కరోనా వైరస్ ఆనవాళ్లు ఉన్నాయని ఆందోళన చెందుతోంది డ్రాగన్ సర్కార్. అటు..చైనా పోకడపై కొందరు ఆరోగ్యరంగ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Advertisements
లియో పూన్ అనే నిపుణుడు మాట్లాడుతూ.. కొన్నివందల మీటర్ల వెడల్పు ఉన్ననదిని దాటుకుని కరోనా వైరస్ కణాలు ప్రయాణిస్తాయంటే ఆశ్చర్యంగా ఉందన్నారు. అయితే జీరో కోవిడ్ పాలసీ అమలు చేస్తున్నందున చైనా ఇలాంటి చర్యలు చేపడుతోందని మరికొందరు భావిస్తున్నారు.