ఫైవ్ స్టార్ హోటల్లో స్టే చేస్తున్నాడంటే కోట్లకు అధిపతై ఉంటాడన్న గుడ్డి నమ్మకం. సూటు,బూటు,మాట చూసి ఎవరూ నకిలీ అనికనిపెట్టడం కష్టం కదా!. అలాంటి ఓ బురిడీ బిజినెస్ మేన్ ని నమ్మి మోసపోయారు ఢిల్లీ లీలా పేలస్ ఫైవ్ స్టార్ హోటల్ యాజమాన్యం.
తాను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన వ్యాపారవేత్తనని చెబుతూ మహ్మద్ షరీఫ్ అనే వ్యక్తి ఆ హోటల్లో దిగాడు. గత ఏడాది ఆగస్టు 1వ తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకు హోటల్లోనే బస చేశాడు.
నకిలీ బిజినెస్ కార్డుతో హోటల్లోకి ప్రవేశించాడు. రూ. 23.46 లక్షల బిల్లు కట్టకుండా హోటల్ నుంచి మాయమయ్యాడు. దీంతో హోటల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.