జంతువులను పోలిన జంతువులు ఉండటం సర్వ సాధారణమైన విషయం. కొన్నిసార్లు అయితే కొన్ని విభిన్నమైన జంతువులు కూడా కనిపిస్తూంటాయి. తాజాగా చిరుతను పోలిన ఓ శునకం పెద్దపల్లి జిల్లాలో హడావిడి చేస్తుంది. కానీ అది శునకం అని తెలియని వారు మాత్రం చిరుతని బెదిరిపోతున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి.
వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా పాలింర్ల మండలం బూరుగూడెం గ్రామానికి చెందిన మట్టే రాంబాబు అనే గిరిజనుడు దగ్గర ఓ శునకం ఐదేళ్లుగా ఉంటోంది. ఆ శునకం కొంత చిరుత.. మరికొంత పులి ఆకారంలో కనిపిస్తోంది.
దీంతో ఆ శునకాన్ని చూసేందుకు స్థానికులే కాకుండా పక్క గ్రామాల వాళ్లు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. అంతేకాదు ఆ శునక యజమాని రాంబాబుకు కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయట.
చిరుతను పోలిన ఆ శునకాన్ని ఇస్తే.. రూ.5 లక్షలు ఇస్తామని అంటున్నారట. అయితే ఆ శునకాన్ని విక్రయించడం తనకు ఇష్టం లేదని చెబుతున్నాడు రాంబాబు. చిరుతను పోలిన ఈ శునక రాజు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.