నర్సింహ, జర్నలిస్ట్
మిస్టర్ ముఖ్యమంత్రి..
మీరు ఇలాగే ఉండాలి
ఒక మెట్టు తగ్గకుండా, ఆర్టీసీ
కార్మికులకు తలొగ్గకుండా, హైకోర్టు
సూచనలను పట్టించుకోకుండా,
మీరు ఇలాగే ఉండాలి
రేపు విద్యుత్తు కార్మికులు, ఎల్లుండి ఉపాధ్యాయులు, తర్వాత టీఎన్జీవోలు,
ఆ తర్వాత కాంటాక్ట్ ఉద్యోగులు,
ఇలా అంతా ఏకమై ఒక్కతాటిపై వచ్చేంతవరకు,
మీరు ఇలాగే ఉండాలి
రాచరికపు పోకడలు, నిరంకుశ, కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని ప్రజలు పూనుకునేంత వరకు,
అణచివేయబడుతున్న జర్నలిస్ట్‌లు ఒక్కటై పెన్నుతో పోటు పొడిచే వరకు,మీరు ఇలాగే ఉండాలి
తాగుడుకు, వాగుడుకు బానిసలై,
పోరాటం మరిచిన పౌరులకు బాధ్యత
గుర్తు వచ్చేంతవరకు, నిద్రపోయిన సమాజం
మేల్కొనేంతవరకు, చిన్నాభిన్నమైన చీమలన్నీ కలిసి విష సర్పాన్ని అంతమొందించేంతవరకు.
మీరు ఇలాగే ఉండాలి.