విధి ముందు ఓడినా జీవితంలో గెలిచి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు పాలమూరు యువకుడు. మహబూబ్ నగర్ కు చెందిన అబ్డుల్ ఇమ్ము పుట్టుకతోనే పోలీయోతో కాళ్లు పోగొట్టుకున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఈయువకుడు ఎక్కడా నిరాశ పడకుండా తాను అనుకున్న లక్షాలను సాధించే దిశగా అడుగులు వేస్తూ విజయాలు సాదిస్తున్నాడు…ఇప్పుడు తన ముందున్న లక్ష్యం కోసం సాధన చేస్తున్న దివ్యాంగుడి పై అందిస్తున్న ప్రత్యేక కథనం….
అబ్దుల్ ఇమ్ము అంటే ఇప్పుడు అందరూ ఆదర్శంగా తీసుకునే వ్యక్తిగా పాలమూరు ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు….
ప్రేమతో హక్కున చేర్చుకుంటున్నారు. ఇటు చదువుల్లో అటు అతను ఎంచుకున్న జిమ్ లో రాణిస్తు పలువురి ప్రశంసలు అందుకుంటున్నాడు.
వివరాలలోకి వెలితే మహబూబ్ నగర్ జిల్లా పట్టణంలో శివశక్తి నగర్ అబ్డుల్ జలీల్ మరియు అజీజా బేగం దంపతులకు జన్మించిన 5సంతానంగా జన్మించిన ఇమ్ము కు పుట్టుకుతోనే పోలియో సోకడంతో రెండు కాళ్ళు లేక అవిటివాడయ్యాడు..పెరిగి పెద్దవుతున్న కొద్దీ తనకు కాల్లు లేవని చాలా మనస్థాపానికి గురి అయ్యాడు.తోటి స్నేహితులు ఆటలు ఆడుతుంటే తనకు అందరితో ఆనందంగగడపాలని అనిపించినా చూస్తూ ఊరుకునే పరిస్థితుల్లో ఇమ్ము మనస్సులో ఏదో తెలియని భాధతో కుమిలి పోయేవాడు… చాలా సంధర్భాలలో ఆత్మ హత్య చేసుకోవాలన్న తన ఆలోచనలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఇక జీవితమంటే ఇంతేనే అనుకున్నాడు… సరిగ్గా ఇలా అనుకుంటున్న సమయంలో తనకు 16 సంవత్సరాల వయస్సులో యూట్యూబ్ లో పోలీయోతో రెండు కాళ్లు పోగొట్టుకున్న వ్యక్తి సాహసాలు ఇమ్ము ను బాగా ప్రభావితం చేసాయి.. అప్పుడే తన ఆలోచనలకు పదును పెడుతూ తనకు ఇష్టమైన జిమ్ పై దృష్టి సారించి చాలా సమయం వ్యాయామం చేస్తూ తన శరీర ఆకృతిని పెంచుకుంటూ బాడీ బిల్డింగ్ లో పతకాలు వేటకు రంగం సిద్ధం చేసుకున్నాడు.అక్కడి నుండి తన లక్షసాధన లో ముందుకు వెలుతూనే వున్నాడు..అతని ఆసక్తిని గమనించిన జిమ్ కోచ్ ఎలాంటి ఫీజు తీసుకోకుండా సహకారాన్ని అందిస్తూ ఇమ్ముకు వెన్నంటి నిలిచాడు…దీన్ని అందిపుచ్చుకున్న ఇమ్ము
24 సంవత్సరాలు వయస్సులో తనకు ఇష్టమైన జిమ్ లో సాధన చేస్తూ బాడీ బిల్డింగ్ లో మిస్టర్ తెలంగాణా మరియు మిస్టర్ దక్షిణ భారతదేశంలో పథకాలను తనఖాతాలో వేసుకున్నాడు.
ప్రస్తుతం డిగ్రీ పూర్తి చేసి ఎంబిఏ మొదటి సంవత్సరం చదువుతున్న అబ్దుల్ ఇమ్ము మిస్టర్ ఇండియా సాధించాలన్నదే లక్ష్యం పెట్టుకుని సాధనను కాస్తా 6గంటలకు పెంచి సాధన చేస్తూ అందరితో ఔరా అనిపించేలా ముందుకు వెలుతున్నాడు…
తను ఎన్నుకున్న రంగంతో పాటు చదువులో కూడా రాణిస్తూ భవిష్యత్తులో మంచి పేరు తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు….కుటుంబ ఆర్ధిక స్థోమత లేకపోయినా తన కుటుంబ సభ్యుల మరియు స్నేహితుల సహాయ సహకారాలు తనకు మరింత పట్టుదలను నింపుతున్నాయి.
ఇప్పుడు తను దివ్యాంగుడినని ఆలోచించకుండా అందరిలా తన పని తను చేసుకుంటున్నాడు…పోలియో మహమ్మారి అబ్దుల్ ఇమ్మును కాటేసినా లెక్క చేయకుండా జీవితంలో అనుకున్నది సాధించేందుకు అతనికున్న పట్టుదలను పలువురుప్రశంశిస్తున్నారు……మనం కూడా ఇమ్ము ప్రయత్నాలు సఫలం కావాలని ఆశిద్దాం..