కరీంనగర్ లో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. సాధారణంగా మనం ఒక తల్లి ఒక ప్రసవంలో ఒకరు లేదా ఇద్దరు పిల్లల్ని కనడం గురించి వింటూ ఉంటాం. కానీ తాజాగా కరీంనగర్ కు చెందిన ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనివ్వడం చర్చనీయాంశంగా మారింది. నికిత అనే మహిళ డబుల్ ట్విన్స్ బేబీస్ కు జన్మనిచ్చింది. నలుగురు పిల్లలు ఎలాంటి అనారోగ్యం లేకుండా సురక్షితంగా పుట్టారు. అయితే బరువు తక్కువగా ఉండడంతో వైద్యులు శిశువులను ఇంక్యుబేటర్ లో పెట్టారు.
గతంలో నిఖిత సోదరి లికిత కూడా ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. మరో విశేషం ఏమిటంటే నికితా, లిఖిత కూడా ట్విన్స్ కావడం. ఇలా ఫ్యామిలీ మొత్తం ట్విన్స్ పుట్టడం చూస్తుంటే వింతగా అన్పిస్తోంది. ఇది జన్యుపరంగా వస్తున్న ఆనవాయితీగా కనిపిస్తోంది. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి.దీనికి వైద్యులు చెప్పే కారణం ఏమిటంటే తల్లుల సగటు వయస్సు పెరగడం, సహాయక పునరుత్పత్తి పద్ధతులు, ప్రత్యేకించి సంతానోత్పత్తి ఔషధాల వాడకం దీనికి కారణం. రెండు రకాల కవలలు ఉంటారు.
ఒకేలాంటి పోలికలతో కవలలు (మోనోజైగోటిక్), వేర్వేరు పోలికలతో కవలలు (డైజైగోటిక్).ఒకేలాంటి కవలలు ఒక ఫలదీకరణ అండం విడిపోయి, ఒకే జన్యు సమాచారంతో ఇద్దరు శిశువులను అభివృద్ధి చేస్తుంది. ఇది సోదర కవలలకు భిన్నంగా ఉంటుంది, ఇక్కడ రెండు అండాలు (ఓవా) రెండు స్పెర్మ్‌ల ద్వారా ఫలదీకరణం చెందుతాయి. దీంతో ఇద్దరు జన్యుపరంగా ప్రత్యేకమైన పిల్లలను ఉత్పత్తి చేస్తాయి. వీరు వేర్వేరు సమయాల్లో జన్మించిన తోబుట్టువులు.