ప్రపంచవ్యాప్తంగా ఏటా ఓ వృక్షాన్ని చూడటానికి దాదాపు 50 వేల మంది పర్యాటకులు వెళ్తుంటారు. దీని వయసు 400 ఏళ్ల పై మాటే. అయితే ఏంటి..? ఆ చెట్టులో అంత ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా.. నిజంగానే ఆ మహావృక్షంలో చాలా ప్రత్యేకత దాగుంది. ఎందుకంటే.. ఏ ప్రాణీ బ్రతికే అవకాశంలేని భయంకరమైన ఎడారి ప్రాంతంలో ఆ చెట్టు ఉంది. కనీసం నీటి చుక్క కూడా లేని పొడి వాతావరణంలో.. నాలుగు శతాబ్ధాలకు పైగా ఈ చెట్టు పచ్చటి ఆకులతో అలరారుతోంది. అందుకే ఈ మహావృక్షాన్ని ట్రీ ఆఫ్ లైఫ్‌గా పిలుస్తున్నారు. మరీ ఆ మహావృక్షం ఎక్కడుంది..? దాని ప్రత్యేకత ఏంటో.. మీరు తెలుసుకోండి.
బ్రహెయిన్ దేశంలోని అరేబియా ఎడారిలో.. ఎత్తయిన ప్రదేశమైన జెబెల్ దుఖన్‌కు 2 కిలోమీటర్ల దూరంలో జమ్మి జాతికి చెందిన ఓ చెట్టు ఉంది. అయితే, ఈ ఎడారిలో ఏడాది పొడవునా పొడి వాతావరణమే ఉంటుంది. అస్సలు వర్షం అనే మాటే ఉండదు. ఒక వేళ కురిసినా.. ఎప్పుడో ఒక్క జల్లు మాత్రమే పడుతుంది. అలాంటి వాతావరణంలో ఈ చెట్టు ఎడారిలో ఎలా నిలిచి ఉందో నేటికీ క్లారిటీ లేదు. అంతేకాదు, ఇంతటి విపరీతమైన వాతావరణ పరిస్థితుల్లో పెరుగుతున్న పెద్ద చెట్టు ఇదొక్కటే కావడం విశేషం.
అయితే, ఈ చెట్టు వేర్లు భూమిలోపల 50 మీటర్ల లోతుకుపైగా చొచ్చుకెళ్లాయి. ఈ క్రమంలో వేర్ల వ్యవస్థకు నీరు అందుతోందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీని ఆకులు వాతావరణంలో ఉండే కొద్ది పాటి తేమ కూడా సేకరిస్తుందని అంటున్నారు. ఇక బాబిలోనియన్, సమేరియన్ పురాణ గాథల ప్రకారం.. ఈ చెట్టును జల దేవత అయిన ఎంకీ సంరక్షిస్తోందని విశ్వసిస్తారు. అందుకే ఈ చెట్టుకు సమీపంలో పూజలు కూడా చేస్తుంటారు.
అంతేకాదు, ఒకప్పుడు బహ్రెయిన్‌లో నీరు పుష్కలంగా ఉండేది. వ్యవసాయం, పంట చేలతో ఈ ప్రాంతం కళకళలాడేది. కాలక్రమంలో ఇక్కడ పచ్చదనం స్థానంలో ఇసుక మేటలు వచ్చి ఎడారి ప్రాంతంగా మారిపోయింది. కానీ ఒకప్పటి బ్రహెయిన్‌ను గుర్తు చేస్తూ ఈ చెట్టు ఎడారిలో దర్జాగా జీవనం సాగిస్తోంది. అలాగే, జమ్మి చెట్టు ఎంత దుర్భర పరిస్థితుల్లో అయినా జీవించగలదని చెప్పడానికి ఇదే సజీవతార్కాణంగా నిలిచింది.
1️⃣ I never visited the Tree of Life in #Bahrain cause I heard ppl say it’s a touristy gimmick. That’s BS. Besides being a lovely 437 year old tree in the middle of the desert with no apparent water source, it’s also a mysterious archaeological site from the Late Islamic period pic.twitter.com/kLcvXfTCFW
— Talal Al-Rashoud طلال الرشود (@tsalrashoud) December 27, 2020
Advertisements