హైదరాబాద్ పై చైన్ స్నాచర్లు పడ్డారు. గంట గ్యాప్ లో నగరంలో ఐదు ఘటనలు చోటు చేసుకున్నాయి. పేట్ బషీరాబాద్ లో రెండు ఘటనలు జరిగాయి. ఇద్దరు మహిళల మెడలో నుంచి గొలుసులు తెంపుకెళ్లాడు దుండగుడు. మరో మహిళ దగ్గర నుంచి లాక్కెళ్లబోయి విఫలమయ్యాడు.
జీడిమెట్లలో మహిళ మెడలో నుంచి 4 తులాల బంగారు గొలుసు చోరీ చేశారు దుండగులు. భాగ్యలక్ష్మి కాలనీలోనూ చోరీకి ప్రయత్నించగా మహిళ కేకలు వేయడంతో పారిపోయారు.
సికింద్రాబాద్ లోని మారేడ్ పల్లిలో మహిళ మెడలో నుంచి మూడున్నర తులాల గొలుసు ఎత్తుకెళ్లాడు స్నాచర్. తుకారం గేట్ దగ్గర కూడా చైన్ స్నాచింగ్ జరిగింది.
బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ను జల్లెడ పడుతున్నారు. మారేడ్ పల్లి, తుకారాం గేట్ ఘటనల్లో నిందితుడు ఒక్కడే అని గుర్తించారు పోలీసులు.
కేవలం గంట వ్యవధిలోనే ఐదు ఘటనలు చోటు చేసుకున్నాయి. నగరంలో మరోసారి వరుస చైన్ స్నాచింగ్ ఘటనలు జరగడంతో మహిళలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.