విమానంలో వెళ్తున్న ఓ ప్రయాణికుడికి వింత అనుభవం ఎదురైంది. ఎయిర్‌లైన్స్ సిబ్బంది తనకు పెట్టిన భోజనంలో బొద్దింక దర్శనమిచ్చింది. దీంతో షాక్ తిన్న ప్రయాణికుడు భోజనంలో చనిపోయిన బొద్దింక ఫొటోని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.
Small cockroach in air Vistara meal pic.twitter.com/ebrIyszhvV
— NIKUL SOLANKI (@manikul008) October 14, 2022
ఎంతో డబ్బు ఖర్చు పెట్టి కొనుగోలు చేసే ఆహార పదార్ధాల్లో పురుగులు రావడం ఎవరికైనా కాస్త చేదు అనుభవమే. విస్తారా ఫ్లైట్‌లో ఓ ప్రయాణికుడికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఎయిర్ లైన్స్ తనకు అందించిన ఆహారంలో బొద్దింకను చూసి నికుల్ సోలంకి అనే ప్రయాణికుడు షాక్ తిన్నాడు.
తనకు ఇచ్చి ప్రీ ఫుడ్ ప్యాకెట్ సగం తిన్న తర్వాత అందులో ఉన్న బొద్దింకను గుర్తించాడు ప్రయాణికుడు. తనకు ఎదురైన అనుభవాన్ని సోలంకి ట్విట్టర్‌లో షేర్ చేయడంతో పాటు ఎయిర్‌లైన్స్‌ను ట్యాగ్ చేశాడు. దీన్ని గుర్తించిన ఎయిర్‌లైన్స్ సోలంకి ట్వీట్ పై రియాక్ట్ అయింది.
అత్యధిక నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఆహారాన్నే మేము సిద్ధం చేసి, ప్రయాణికులకు అందిస్తున్నామని వెల్లడించింది. మీ విమాన వివరాలను పంపితే ఈ అంశంపై తాము దృష్టి సారించి పరిస్ధితిని చక్కదిద్దుతామని పేర్కొంది.
కాగా ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. విస్తారా సర్వీస్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. విమానాలు లేదా ట్రైన్లలో ఆహారంలో పురుగులు రావడం సర్వసాధారణంగా మారిందని సెటైర్స్ వేస్తున్నారు.