అమెరికాలోని ఓ పాఠశాలలో కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటన అమెరికాలోని సౌత్ కరోలీనా టాంగిల్ వుడ్ స్కూల్ లో చోటుచేసుకుంది. అదే స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్న ఓ విద్యార్ధి.. తోటి విద్యార్ధులపై కాల్పులు జరపగా.. ఓ విద్యార్ధి మృతి చెందాడు.
కాల్పుల శబ్ధం విన్న మాథమెటిక్స్ టీచర్ కోనేరు శ్రీధర్ అప్రమత్తం అయ్యారు. తన క్లాసులో ఉన్న 20 మంది విద్యార్థులను బెంచిల కింద కూర్చోబెట్టి తలుపులు మూసివేశాడు. వెంటనే స్కూల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో పాఠశాలకు చేరుకున్న గ్రీన్ విల్లే కౌంటీ పోలీసులు.. కాల్పులకు పాల్పడిన విద్యార్ధిని అదుపులోకి తీసుకొని.. పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఘటనకు గల కారణాలపై విచారిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.
Advertisements
కాగా.. సుమారు 20 మంది విద్యార్తులను రక్షించిన శ్రీధర్ ను స్కూల్ యాజమాన్యంతో పాటు.. విద్యార్ధుల తల్లిదండ్రులు అభినందించారు. అయితే.. శ్రీధర్ స్వస్థలం ఏపీలోని విజయవాడ ప్రసాదంపాడుకు చెందిన వాడు కావడం గమనార్హం. గత కొంత కాలంగా అక్కడ మాథమెటిక్స్ టీచర్ గా పని చేస్తున్నట్టు శ్రీధర్ తెలిపారు.