పాకిస్తాన్ కు చెందిన 5 ఏళ్ల పిల్లాడు నిలబడి మరీ టయోటా ల్యాండ్ క్రూయిజర్ వి 8 ను నడుపుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది! జనవరి 26 న పాకిస్తాన్ లోని ముల్తాన్ నగర వీధుల్లో తీసిన వీడియో ఇది.
వీడియో వైరల్ అవ్వడంతో సిసిటివి ఫుటేజ్ లను పరిశీలించి కార్ నెంబర్ ను నోట్ చేసుకున్న పోలీసులు సదరు కార్ ఓనర్ కు నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. 5 ఏళ్ల కుర్రాడు కార్ నడపడం ఆశ్చర్యం, అభినందనీయమే కానీ పెద్దలు ఎవ్వరూ పక్కన లేకుండా కేవలం అతడి చేతికే కార్ ను ఇవ్వడం ఇతరుల ప్రాణాలను రిస్క్ లో పెట్టినట్టే కదా!
Watch Video :
A small kid driving Landcruiser in Multan 😳 how’s his feet even touching pedals. Whose kid is this 😂 pic.twitter.com/h5AXZztnYb
— Talha (@talha_amjad101) January 26, 2021