కరోనా వైరస్ తో కలిసి సహ జీవనం చేయాల్సిందే. వ్యాక్సిన్ లేదా మందులు వచ్చే వరకు మన జాగ్రత్తలో మనం ఉంటూ కరోనాతో కలిసి జీవించాల్సిందేనంటూ ప్రభుత్వాధినేతలు స్పష్టం చేస్తున్నారు. రోజుల తరబడి జనం ఇంటికే పరిమితం అయినా, ఆర్థిక వ్యవస్థలకు తాళం వేసి ఇంట్లో కూర్చున్నా కేసులు తగ్గలేదు సరికాదా మరింత పెరుగుతున్నాయి.
హైదరాబాద్ లో కరోనా కారణంగా చనిపోయిన వారిని ఖననం చేసేందుకు జనం ఒప్పుకోవటం లేదు. దాంతో చేసేదేమీ లేక ప్రభుత్వాలు జనావాసాలకు దూరంగా కరోనా కారణంగా చనిపోయిన వారి ఖననం చేస్తుంది. అందుకు కరోనా పై ఉన్న అపోహాలు, భయం, మనం కూడా చనిపోతామన్న ఆందోళనతో జనం ఉండటమే అసలు కారణంగా కనపడుతోంది. ఇదే అంశంపై సిటీకి దూరంగా ఉన్న శ్మశాన వాటిక వద్ద ఫోటో దిగుతూ, సీనీయర్ జర్నలిస్ట్ బర్ఖహా దత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని… కరోనా భయం ఎంత ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అంటూ ఆమె ట్వీట్ చేశారు.
Hyderabad had to create a COVID Kabristan outside the city. Within the city, fear, paranoia, stigma, was disallowing all burials. The things I thought I would never see in my life time. This report later on @themojo_in. Day 63 On The Road with the Pandemic pic.twitter.com/PgQtACqfK5
— barkha dutt (@BDUTT) May 18, 2020