హీరో ప్రభాస్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా హిట్ టాక్‌తో సంబంధం లేకుండా ప్రభాస్‌తో భారీ బడ్జెట్ సినిమాలు చేసేందుకు నిర్మాతలు పోటీ పడుతుంటారు. ప్రస్తుతం రాధాక్రిష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేస్తున్నారు. ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోండగా… పలువరు బాలీవుడ్ అగ్రనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
రాధే శ్యామ్ అనే టైటిల్ ఫిక్స్ చేస్తున్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే… ఈ సినిమాలో వాటర్‌లో ఉండే ఓ చేజింగ్ షాట్స్ కోసం అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేకంగా ఓ ఎకరం స్థలంలో చెరువును ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ నేతృత్వంలో ఈ చెరువు సెట్‌ను ఏర్పాటు చేశారట.
అంతేకాదు ఇదే అన్నపూర్ణ స్టూడియోలో ఓ ట్రైన్ సెట్ కూడా ఏర్పాటు చేశారట. ఈ సంవత్సరం పూర్తయ్యేలోపు షూటింగ్ ముగించేసి, వచ్చే వేసవి అంటే… 2021 సమ్మర్‌లో సినిమా రిలీజ్ చేయాలని భావిస్తోందట చిత్ర యూనిట్.