నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా వస్తున్న సినిమా లవ్ స్టోరీ. శేఖర్ కమ్మల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం… మరో రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకోవాల్సిన తరుణంలో కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.
అయితే, అక్టోబర్ నుండి మళ్లీ షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. అందుకోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా ఓ విలేజ్ సెటప్ వేయబోతున్నట్లు తెలుస్తోంది.ఇక్కడే సినిమా షూటింగ్ పూర్తి చేసి, 2021మొదట్లో సంక్రాంతికి సినిమా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ పల్లెల నుండి హైదరాబాద్ వచ్చిన యువతీ, యువకుల ప్రేమ కథతో ఈ సినిమా రాబోతుంది. ఏషియన్ సినిమాస్ ఈ సినిమాను రూపొందిస్తుంది.