హైదరాబాద్ లోని ఇప్లూలో విషాద ఘటన చోటు చేసుకుంది. బిల్డింగ్ పై నుంచి దూకి పీజీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్లోని 4 ప్లోర్ నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది.
నిన్న రాత్రి అంజలి తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసినట్లు తోటి విద్యార్థినులు తెలిపారు. వాళ్ళ అమ్మతో ఫోన్ లో మాట్లాడుతూనే అంజలి పై నుంచి దూకినట్లు తెలుస్తోంది.
అంజలి హర్యానా రాష్ట్రానికి చెందిన విద్యార్థిని. ప్రస్తుతం ఆమె ఎంఏ రెండవ సంవత్సరం ఇంగ్లీష్ చదువుతోంది. కుటుంబ సమ్యసల వాళ్ల మృతి చెందినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేవలం కుటుంబ సమస్యల వల్లేనా, లేక మరేదైనా సమస్యల వల్ల అంజలి ఆత్మహత్య చేసుకుందా అనే విషయం మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.