హైదరాబాద్ గచ్చిబౌలిలో దారుణం చోటుచేసుకుంది. బాలుర గురుకుల ఐఐటీ క్యాంపస్‌లో ఇద్దరు విద్యార్ధుల మధ్య జరిగిన గొడవలో ఓ విద్యార్థి మరో విద్యార్థి గొంతుకోశాడు.
గాయపడిన విద్యార్ధికి తీవ్ర రక్తస్రావం అయింది.గమనించిన తోటి విద్యార్ధులు హాస్టల్ వార్డెన్ కు సమాచారం అందించారు. సకాలంలో స్పందించిన వార్డెన్.. బాధితున్ని గచ్చిబౌలి ఆస్పత్రికి తరలించారు.
సకాలంలో విద్యార్థికి చికిత్స అందడంతో ప్రాణాపాయం తప్పిందని వైద్యులు వెల్లడించారు. అయితే.. ఈనెల 26న గురుకుల క్యాంపస్‌లో రాత్రి అల్పాహారం తింటుండగా ఉప్మా ఓ విద్యార్థి చేయి మీద పడింది. దీంతో ఆ ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ మొదలైంది.
గొగొడవ సమయంలో అక్కడే ఉన్న క్యాంపస్ టీచర్.. వారికి సర్దిచెప్పి పంపించేశారు. అదే మనసులో పెట్టుకున్న ఓ విద్యార్ధి కక్ష పెంచుకున్నాడు. అర్ధరాత్రి అందరు పడుకున్న తర్వాత ఇంకొక విద్యార్థిపై కత్తితో దాడి చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.