విశాఖ, తొలివెలుగు: దువ్వాడ రైల్వే స్టేషన్ లో ఓ యువతి ప్రమాదవశాత్తు రైలుకి, ప్లాట్ ఫాంకి మధ్య ఇరుక్కుపోయింది. సకాలంలో రైల్వే రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి ఆమెను ప్రమాదం నుండి కాపాడారు. అన్నవరానికి చెందిన విద్యార్థిని దువ్వాడలోని ఓ కాలేజీలో ఎంసీఏ చదువుతోంది. ఎప్పటిలాగే కాలేజ్ కు వెళ్ళేందుకు గుంటూరు-రాయగడ్ ఎక్స్ ప్రెస్ లో దువ్వాడ స్టేషన్ కు చేరుకుంది. రైలు దిగుతున్న క్రమంలో ఆమె కాలు రైలు, ఫ్లాట్ ఫాం మధ్యలో ఇరుక్కుపోయింది.
వెంటనే స్పందించిన రైల్వే సిబ్బంది యువతిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు. తక్షణం రైలు నిలిపివేశారు. నడుము వరకు ఇరుక్కుపోయిన విద్యార్ధిని ప్రాణభయంతో పెద్దగా కేకలు వేసింది. చాకచక్యంగా వ్యవహరించి చివరికి ఆమెను బయటకు తీసి హుటాహుటిన కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. యువతిని కాపాడిన రైల్వే సిబ్బందిని స్థానికులు ప్రశంసించారు.
పూర్తి కథనం