రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఇన్ముల్ నర్వ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో శనివారం ఉదయం పాఠశాలలో ఉన్న చెత్తను పోగు చేసి మంట పెట్టారు విద్యార్థులు. అయితే ఒక్కసారిగా మంటలు పెద్దగా వ్యాపించాయి. చుట్టూ పొగ కమ్ముకుంది. ఆ సమయంలో ముజాహిల్ అనే 1వ తరగతి విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి.
నిజానికి ప్రభుత్వ పాఠశాలలో అటెండర్, స్వీపర్స్ లేకపోవడంతో కొన్నిపాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాల తరగతి గదులను పాఠశాల పరిసర ప్రాంతాలను శుభ్రం చేసుకుంటున్నారు.
అయితే మంటలు అంత పెద్ద ఎత్తున ఎగిసి పడటానికి కారణం ఏంటి అనేది తెలియరాలేదు. కానీ పిల్లల తల్లిదండ్రులు మాత్రం అధికారులు చర్యలు తీసుకుని ఇలాంటివి జరగకుండా చూడాలని కోరుతున్నారు.