విద్యాబుద్దులు చెప్పాల్సిన టీచర్లే ఆడపిల్లలను కామవాంఛతో చూస్తుంటే ఈ సమాజం ఎటుపోతుందోననే భయం వేస్తోంది. చిన్నపిల్లలు, పెద్దవాళ్లు అని తేడా లేకుండా ఆడవాళ్లపై రోజుకో దగ్గర అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కేరళలోని ఎరోడ్ జిల్లాలో ఓ దారుణం వెలుగుచూసింది.
జిల్లాకు చెందిన పదో తరగతి విద్యార్థిని ఓ ఉపాధ్యాయుడి దగ్గరకు కోచింగ్ క్లాసులకు వెళ్తోంది. బాలికపై కన్నేసిన టీచర్ బలవంతంగా లోబర్చుకున్నాడు. ఎవరికి చెప్పొద్దని బెదిరించాడు. భయంతో విద్యార్ధిని ఎవరికి చెప్పలేదు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ అమ్మాయి గర్భం దాల్చడంతో విషయం వెలుగుచూసింది.
బాలికను తల్లిదండ్రులు నిలదీయడంతో జరిగిందంతా చెప్పింది. దీంతో టీచర్ పై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పేరెంట్స్. వెంటనే స్పందించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.