నిన్న రాత్రి భాగ్యనగరాన్ని వరదలు ఒక్కసారిగా ముంచెత్తాయి. నగరంలో అనేక చోట్లు పలు కాలనీలు, ఇళ్లు నీట మునిగాయి. దీంతో నగర వాసులు నరకాన్ని అనుభవిస్తున్నారు.
ఈ క్రమంలో ఓ కుటుంబం నిన్న రాత్రి మోకాలు లోతు నీటిలో ఎటు వెళ్లాలో తెలియక దిక్కు తోచని స్థితిలో నిల్చుని ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తమ ఇంటి లోనికి నీరు రావడంతో ఓ కుటుంబం లోని వ్యక్తి, తన భార్య, అమ్మ, చంటి బిడ్డతో నడుములోతు నీటిలో బిక్కుబిక్కుమంటూ బయటకు వచ్చారు. ఎటుపోవాలో తెలియని స్థితిలో ఉన్న వారికి అక్కడే ఉన్న కొందరు తమ ఇంటికి రావాలని పై నుంచి పిలిచారు.
దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.వేల కోట్లు పెట్టి నగరాన్ని అభివృద్ధి చేశామని చెప్పుకునే నాయకులు ఈ వీడియోకు సమాధానం చెప్పాలంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో కన్నీరు తెప్పిస్తున్న వీడియో..@KTRTRS @CommissionrGHMC @bandisanjay_bjp @revanth_anumula @RSPraveenSwaero pic.twitter.com/eA1YtoJt8s
— M Mahesh (@MMahesh72686076) October 13, 2022