రాష్ట్ర రాజధానిలో మరో దారుణం జరిగింది. జూబ్లీహిల్స్ ఘటన మరవక ముందే రోజుకో దారుణం బయటపడుతోంది. హైదరాబాద్ ఛత్రినాక పరిధిలో 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది.
అలీ అనే యువకుడితో ఉప్పుగూడా ప్రాంతానికి చెందిన బాధిత బాలికకు పరిచయముంది. వీరిద్దరి మధ్య ఉన్న చనువుతో బాలికను తమ ఇంటికి పిలిచాడు అలీ. అప్పటికే తమ ఇంట్లో ఉన్న అలీ స్నేహితుడు అర్బాస్ తో కలిసి బాలికను అత్యాచారం చేశాడు.
జరిగిన విషయాన్ని బాలికి తన తల్లికి చెప్పింది. వెంటనే బాలిక కుంటుంబ సభ్యులు పోలీసులకు పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. బాధితురాలిని భరోసా సెంటర్ కు పంపించారు.
నిందితులు అలీ, అర్బాస్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే.. నిందితుల్లో ఒకరు బాధిత బాలిక బంధువుగా పోలీసులు గుర్తించారు. త్వరలోనే ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.