గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాటు.. వీస్తున్న ఈదురు గాలులకు రహదారుల వెంట ఉన్న వృక్షాలు నేలకొరుగుతున్నాయి. రహదారులకు అడ్డంగా పడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ఇటీవల భారీగా వీచిన ఈదురు గాలులకు పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతానగరం మండలం జోగమ్మపేట వద్ద జాతీయ రహదారిపై భారీ వృక్షం రోడ్డుకు అడ్డంగా కుప్పకూలింది. దీంతో వాహనాల రాకపోకలకు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
సమాచారం అందుకున్న పోలీసుల.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులు, ప్రయాణికుల సహాయంతో రోడ్డుపై పడిఉన్న చెట్టును తొలగించి.. ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. దీంతో గంటల కొద్ది వర్షంలో ఉండాల్సి వచ్చిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యుత్ తీగలపై చెట్టు కూలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కాగా.. భారీగా వీస్తున్న ఆదురు గాలులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు సముద్ర తీరాలకు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు అధికారులు.