తమ విద్యార్థులంతా బాగా చదువుకోవాలని, చదివింది గుర్తుపెట్టుకొని… మంచి మార్కులు సాధించుకోవాలని ప్రతి టీచర్ ఆశపడతారు. అందులో పెద్ద తప్పు లేదు. కొందరు స్టూడెంట్స్ ఎంత చదివినా గుర్తుండటం లేదు అని చెప్తుంటే గుర్తుపెట్టుకొనేందుకు పలు చిట్కాలు చెప్తుంటారు. కానీ ఢిల్లీలోని ఓ ట్యూషన్స్ చెప్పే టీచర్ విద్యార్థులకు చదివింది గుర్తుంచుకోవటానికి ఏకంగా ఇంజెక్షన్లు ఇస్తున్నాడు.
ఢిల్లీలో బీఏ చదువుతున్న సందీప్ అనే 20ఏళ్ల యువకున్ని అరెస్ట్ చేశారు. తను చదువుకుంటూ సాయంత్రం ట్యూషన్స్ చెప్తుంటాడు. ఓ విద్యార్థి తండ్రి ఇలా నార్మల్ సెలైన్ ఇంజెక్షన్ ఇస్తూ జ్ఞాపకశక్తి పెంచేలా ఇంజెక్షన్స్ ఇస్తున్నానంటూ చెప్తున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి తనను అరెస్ట్ చేశారు.
పోలీసులు సందీప్ ను విచారించగా… చదివింది ఎక్కువగా గుర్తుంచుకునేందుకు ఎం చేయాలని అని యూట్యూబ్ లో చూశానని, అందులో ఈ ఇంజెక్షన్లు ఇచ్చినట్లు చూడటంతో తను కూడా ఫాలో అయ్యానంటూ చెప్పుకొచ్చాడు. పోలీసులు సందీప్ పై కేసు నమోదు చేశారు.