ఉస్మానియా పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ మిస్సింగ్ కేసులో ట్విస్ట్ బయటపడింది. ఈనెల 5న కనిపించకుండా పోయిన చంద్రకళ(38) అనే మహిళ 16న మౌలాలి రైల్వే స్టేషన్ సమీపంలో శవమై తేలింది.
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన మల్కాజిగిరి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా… మహిళను ఇద్దరు వ్యక్తులు కలిసి రేప్ చేసి హత్య చేసినట్లు నిర్ధారించారు.
టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా బనావత్ రాజు (28), సయీద్ గౌస్(63)లను నిందితులుగా గుర్తించారు. మద్యం మత్తులో మహిళని రేప్ చేసి చంపినట్లు పోలీసులు గుర్తించారు.
అయితే అసలు చంద్రకళ అక్కడికి ఎందుకు వెళ్లింది.ఎవరైనా రమ్మంటే వెళ్లారా? లేక చంద్రకళ అటు వైపు వెళ్లడం చూసి నిందితులు ఆమెను చంపడం జరిగిందా అనే కోణాల మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.