అసలే చలికాలం. క్లైమేట్ కారణంగా సుమబాణంలా దూసుకొస్తున్న శీతలగాలులు. వెరసి కొనసాగుతున్నాయి ప్రజల గజగజలు. ఇక ముసలివాళ్ళ సంగతైతే చెప్పనే అక్కర్లేదు. దేశవ్యాప్తంగా చలితీవ్రత పెరిగింది. ఉత్తరాదిలో అయితే పగటి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠస్థాయికి పడిపోయాయి. జనం చలికి వణికిపోతున్నారు. ఇండ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి.
కొందరు చలి మంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. కానీ, ప్రయాణ సమయాల్లో మాత్రం ప్రజలు చలి కారణంగా తీవ్ర ఇబ్బందులుఎదుర్కొంటున్నారు. కార్లు,ఆటోలు, బస్సుల్లో ప్రయాణించే వాళ్ళ సంగతి పర్వాలే బైక్‌పై వెళ్లేవారైతే అంతే సంగతులు. చలికి వేళ్ళు వంకర్లు పోతున్నాయి.
ఈ క్రమంలో మధ్యప్రదేశ్ ఇండోర్‌లో ఇద్దరు యవకులు బైక్‌పై వెళ్లే సమయంలో చలి నుంచి ఉపశమనం పొందేందుకు వినూత్నంగా ఆలోచించారు. బైక్ వెనుకవైపు చిన్న కుంపటి అమర్చి అందులో మంటపెట్టి చలి కాచుకుంటూ రోడ్డుపై చక్కర్లు కొట్టారు.
రోడ్డు పొడవునా ఉన్న ప్రజలు ఈ యువకులను విచిత్రంగా చూస్తూ..వీడియోలు తీసి నెట్టింట పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
#MadhyaPradesh: Pillion rider carries lighted 'sigdi' during motorcycle stunt in #Indore; #cops begin probe#MPNews #NewsAlert #NewsUpdate #NewsToday pic.twitter.com/DRuizjrxLs
— Free Press Journal (@fpjindia) January 21, 2023