కదులుతున్న రైలు ఎక్కుతూ ఎందరో ప్రయాణికులు జారిపడిన ఘటనలు చాలా ఉన్నాయి. స్టేషన్ కి లేట్ గా రావడం, రైలు కదిలి పోతుందన్న కంగారు.
ఆ కంగారులో కదులుతున్న రైలు ఎక్కే ప్రయత్నంలో ఎందరో జారిపడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నవారు కొందరైతే, కాళ్లు, చేతులు విరగ్గొట్టుకుని వికలాంగులుగా మారుతున్న వారు కొందరు.
మరి కొంతమంది స్వల్ప గాయాలతో బయటపడుతున్న వారు ఉన్నారు.తాజాగా ఇలాంటి ఘటనే మహారాష్ట్ర రాజధాని ముంబైలోని దాదర్ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది. ఓ మహిల కదులుతున్న రైలు ఎక్కే ప్రయత్నంలో జారిపోయింది.
వెంటనే అక్కడే ఉన్న ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్, మరికొందరు ప్రయాణికులు వెంటనే స్పందించి ఆ మహిళను ప్లాట్‌ఫామ్ పైకి లాగేయడంతో ప్రాణాపాయం తప్పింది. దీంతో అందరూ ఊపరి పీల్చుకున్నారు.