నడిరోడ్డు పై ఓ మహిళను చితకబాదారు కొంత మంది వ్యక్తులు. హైదరాబాద్ సైదాబాద్ పూర్ణోదయా కాలనీ లో మహారాష్ట్ర కు చెందిన మహిళ టీ కొట్టు పెట్టి జీవనం సాగిస్తుంది. అయితే సమీపంలో మరో టీ కొట్టుని స్థానిక పూసలబస్తీ కి చెందిన కొందరు వ్యక్తులు పెట్టారు. కాగా అకారణంగా మహిళ పై దాడికి దిగారు.
దుర్భాషలు ఆడుతూ… మహిళ చీరనులాగే ప్రయత్నం కూడా చేశారు. దీనితో బాధిత మహిళ సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు 324, 509, 506 కింద కేసులు పెట్టి విడిచిపెట్టారు . అయితే సదరు దాడి చేసిన వ్యక్తులకు టిఆర్ఎస్ నేతల అండ ఉన్నట్లు తెలుస్తోంది.