గత కొన్ని నెలలుగా ఉక్రైన్ పై రష్యా మారణహోమం సాగిస్తోంది. పొరుగు దేశాలు నచ్చజెప్పే ప్రయత్నం చేసాయన్నది ఎంత వాస్తవమో..! ఎవరి ప్రయోజనాలు వారికి నెరవేరుతున్న క్రమంలో మరికొన్నిదేశాలు వేడుక చూస్తున్నాయన్నది కూడా అంతే వాస్తవం.
పర్యవసానంగా ఎంతోమంది అమాయక ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.ఇంకా భయానక పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. దాడులతో తెగబడుతున్న రష్యా సేనలను ఉక్రెయిన్ దీటుగా నిలువరిస్తోంది. ఫలితంగా ఇరు వైపులా భారీ నష్టం సంభవిస్తోంది.
అయినప్పటికీ ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. రష్యా దురాక్రమణపై పలువురు అంతర్జాతీయ వేదికలపై గళం విప్పారు. తాజాగా, 76వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో రక్తాన్ని పోలిన రంగును ఒంటిపై పూసుకున్న ఓ మహిళ రెడ్‌కార్పెట్‌పై నడిచి కలకలం రేపింది.
‘యాసిడ్’ సినిమా ప్రీమియర్ సందర్భంగా ఆదివారం చిత్ర బృందం రెడ్‌కార్పెట్‌పై ఫొటోలకు పోజులిచ్చింది. అదే సమయంలో ఉక్రెయిన్ జాతీయ జెండా రంగులైన నీలం, పసుపు రంగుల దుస్తులో వచ్చిన ఓ మహిళ ఫొటోలకు పోజిచ్చింది.
ఆ వెంటనే వెంట తెచ్చుకున్న ఎరుపు రంగును తలపై పోసుకుని శరీరమంతా రాసుకుంది. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లారు.
ఆ మహిళ ఎవరన్నదీ తెలియరాలేదు. అయితే, ఆమెను ఉక్రెయిన్ వాసిగా అనుమానిస్తున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు నిరసనగానే ఆమె ఇలా చేసినట్టు తెలుస్తోంది. కాగా, గతేడాది కూడా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ ఇలాగే ఓ మహిళ అనూహ్యంగా నిరసన తెలిపి కలకలం రేపింది.
A woman wearing a dress the color of the Ukrainian flag at the Cannes Film Festival spilled fake blood on her to draw attention to the Russian invasion of Ukraine pic.twitter.com/VOap2CSnas
— Vega (@Vega12991453) May 22, 2023