పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ మధ్య ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. పవన్ హీరోగా తను ఖచ్చితంగా సినిమా చేస్తానంటూ మెగా అభిమానులకు ప్రామిస్ చేసిన రాంచరణ్… ఇప్పుడు ఆ ప్రామిస్ నెరవేర్చేందుకు రెడీ అవుతున్నాడు.
ఇటీవల బాబాయ్-అబ్బాయ్ కలయిక సందర్భంగా సినిమా అంశం మరోసారి తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. కథ రెడీ చేసుకో అని బాబాయ్ చెప్పేయటంతో… రాంచరణ్ ఆ పనిలో ఉన్నారు. ఇప్పటికే పలువురు అగ్ర దర్శకులంతా తమ తమ సినిమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో, యంగ్ డైరెక్టర్ తో సినిమా తీయాలని రాంచరణ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ బ్యానర్ లో రాంచరణ్ భారీ బడ్జెట్ మూవీ ప్లాన్ చేస్తున్నట్లు ఫిలింనగర్ టాక్.