మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించడం తో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కుమ్మరి సంతోష్ అనే వ్యక్తి చెన్నూర్ పట్టణం లో ఎంపీడీఓ కార్యాలయం దగ్గర టైలరింగ్ చేస్తుంటాడు.
అయితే అతను షాప్ నిర్వహిస్తున్న స్థలం బినామీ పేరు మీద ఉంది అనే నెపంతో ఎంపీడీఓ , ఎంపీపీ షాప్ కి తాళం వేశారు. దీనితో సంతోష్ ఎంతో మంది అధికారులను, ప్రజా ప్రతినిధులను సంప్రదించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.
దీంతో సోమవారం ప్రజావాణిలో విన్నవించేందుకు వచ్చాడు. ఈ క్రమం లోనే ఎంపీడీఓ, ఎంపీపీ తనను వేధిస్తున్నారంటూ ఆరోపిస్తూ కలెక్టరేట్ ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.
అయితే అతడిని అడ్డుకున్న పోలీసులు అతనిని ఆసుపత్రికి తరలించారు.