ఆన్‌లైన్ బెట్టింగ్ ఓ యువకుడి ప్రాణాలు బలితీసుకుంది. స్నేహితులు మాటలు నమ్మి ఆన్ లైన్ బెట్టింగ్ డబ్బులు నష్టపోయానని సెల్ఫీ వీడియో తీసుకుని పురుగుల మందు తాగాడు.
ధర్మసాగర్ మండలం మలక్ పల్లి గ్రామానికి చెందిన రామకృష్ణ కొంతకాలంగా ఆన్ లైన్ బెట్టింగ్ కు అలవాటుపడ్డాడు. స్నేహితుల మాటలు విని భారీ మొత్తంలో బెట్టింగ్ పెట్టడంతో దాదాపు రూ. 10 లక్షలు నష్టపోయాడు.
తల్లిదండ్రులు లేని తనను ఫ్రెండ్స్ మోసం చేశారని మనస్తాపం చెందిన రామకృష్ణ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకు ముందు ఓ సెల్ఫీ వీడియో తీసుకుని గ్రామస్థులకు పంపారు.
విషయం తెలుసుకున్న స్థానికులు అపస్మారక స్థితిలో ఉన్న రామకృష్ణను ఎంజీఎంలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనకు సంబంధించి కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.