పెళ్లంటే ఎవరికైనా ఒకసారే వచ్చే పండుగ. దానిని జీవితాంతం గుర్తు పెట్టుకునే విధంగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. తమతో పాటు తమ పెళ్లి అందరికీ ఎప్పటికీ గుర్తుండిపోవాలని కోరుకుంటారు చాలా మంది. ఈ క్రమంలో పెళ్లిని చాలా గ్రాండ్ గా చేసుకుంటారు. పెళ్లి కోసం ఆహూతులందరు ఒక్కసారే ప్రయాణిస్తూ. తమ స్నేహతులతో, సన్నిహితులతో చేసే అల్లరి గురించి ఎంత చెప్పినా తక్కువే.
కుటుంబ సమేతంగా చుట్టాలు, స్నేహితులతో ప్రయాణించడానికి చాలా మంది బస్సులు లేదా రైళ్లను బుక్ చేసుకుంటారు. ఇది దేశవ్యాప్తంగా సాధారణ దృశ్యం అయితే.. తమ కుటుంబాన్ని పెళ్లికి తీసుకెళ్లేందుకు మొత్తం విమానాన్ని బుక్ చేసుకున్న ఘటనలు గురించి విన్నారా.. దేశ వ్యాప్తంగా ఎదురుగా ఇటువంటి సంఘటలు జరుగుతూ ఉంటాయి.
భువన్ అనే పెళ్లికొడుకు.. తన మ్యారేజ్ కోసం ఏకంగా ఒక విమానాన్నే బుక్ చేశాడు. వాళ్లతో కలిసి విమానంలో పెళ్లికి వెళ్లాడు. ఖర్చు గురించి ఆలోచించకుండా విమానం మొత్తాన్ని బుక్ చేశాడు. ఇతనితో పాటు ప్రయాణించిన బంధువులు ఫుల్ జోష్‌లో కన్పించారు. కెమెరాలకు లవ్ సింబల్‌తో ఫోజులిచ్చారు.
ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా.. అది వైరల్‌గా మారింది. శుభ్ వెడ్డింగ్ అనే పేజ్‌లో ఈ వీడియోను షేర్ చేశారు. ఈ షార్ట్ క్లిప్‌లో భువన్ కుటుంబ సభ్యులు, బంధువులు కెమెరా వైపు చూస్తూ కేరింతలు కొట్టడం కనిపిస్తుంది. తన చేతులపై మెహందీతో భువన్ సైతం ఈ క్లిప్‌లో కనిపించాడు. ఈ వైరల్ వీడియోకు ఇప్పటివరకూ పది లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి.
ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెట్టారు. తమకు నచ్చిన రీతిలో కామెంట్లతో కేక పుట్టిస్తున్నారు. ఈ వీడియోకు నెటిజన్లు ఫిదా అయ్యారు. మీరు సంపన్నులని చెప్పకనే చెబుతున్నారని ఓ యూజర్ కామెంట్ చేయగా, జీవితంలో ఇంత డబ్బు సంపాదిస్తే చాలని మరో యూజర్ కామెంట్ చేశారు.