ప్రేమ పేరుతో నమ్మించాడు. తనకు మాయ మాటలు చెప్తూ పలుమార్లు అత్యాచారం చేశాడు. తీరా ఆమె గర్భం దాల్చాక… బయటకు తెలిస్తే తనకు ప్రమాదమని, అబార్షన్ చేయించుకోవాలని ఆ 25 ఏళ్ల యువతిని కోరాడు. డాక్టర్ వద్దకు వెళ్తే ఎవరికైనా తెలుస్తుందేమో అన్న భయంతో ఆ యువతి యూట్యూబ్ లో అబార్షన్ వీడియోలు చూసి ట్రై చేసి ఆసుపత్రి పాలయ్యింది.
మహారాష్ట్రలోని నాగపూర్ లో సోహెబ్ ఖాన్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో ఓ యువతిని 2016 నుండి కలిసి తిరుగుతున్నాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పటంతో ఆ యువతి కూడా ఆ మృగాన్ని నమ్మింది. ప్రేమ పేరుతో వచ్చించి ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. తీరా గర్భం దాల్చాక అబార్షన్ చేయించుకో అని వదిలేశాడు. ఆ యువతి యూట్యూబ్ లో చూస్తూ అబార్షన్ ట్రై చేయగా… తీవ్ర రక్తస్రావం కావటంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. దీంతో విషయం బయటకు తెలిసింది.
ఈ ఘటనలో సోహైల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.