కెరీర్ ప్రారంభించి చాలా ఏళ్ళు అవుతున్నా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు హీరో సందీప్ కిషన్. గతంలో నిన్ను వీడని నీడను నేనే అనే చిత్రంతో హిట్ కొట్టాడు. అయితే ఆ జోష్ ఎక్కువ రోజులు నిలవలేదు. వెంటనే తెనాలి రామకృష్ణ రూపంలో ఫ్లాప్ పడింది. దీంతో తన తదుపరి సినిమాల విషయంలో జాగ్రత్తలు పడుతున్నాడు. సందీప్ ప్రస్తుతం డెన్నిస్ జీవన్ దర్శకత్వంలో ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమాలో నటిస్తున్నాడు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది. అయితే రిపబ్లిక్ డే సందర్భంగా చిత్ర యూనిట్ ట్రైలర్ ను విడుదల చేసింది. ట్రైలర్ చూసిన నెటిజన్లు సందీప్ ఈసారి ఖచ్చితంగా హిట్ సాధిస్తాడు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సింగిల్ కింగ్ లు సాంగ్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో లావణ్య త్రిపాటి నటిస్తున్న సంగతి తెలిసిందే.