భీమ్లానాయక్ వల్ల ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాకు ఆశించిన స్థాయిలో థియేటర్లు దొరకలేదు. విడుదలైన ఆ కొద్ది థియేటర్లలో కూడా సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చేసింది. దీంతో శర్వానంద్ సినిమాకు మొదటి రోజు ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 2 కోట్ల 90 లక్షల రూపాయల గ్రాస్ వచ్చింది. షేర్ లో చూసుకుంటే, ఈ మొత్తం కోటి 57 లక్షల రూపాయలు మాత్రమే.
ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాకు శని, ఆదివారాల్లో ఎంత వస్తుందనే దానిపైనే ఈ సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. ఈ వీకెండ్ ఈ సినిమా కోలుకుంటే ఓకే, లేకపోతే బయ్యర్లకు భారీ నష్టాలు తప్పవు. ఒక్కొక్కరు 70శాతానికి పైగా నష్టపోయే ప్రమాదం ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను 14 కోట్ల రూపాయలకు అమ్మారు. అంటే కనీసం 14 కోట్ల 50 లక్షల రూపాయలైనా రావాలి. మొదటి రోజే ఆశించిన స్థాయిలో వసూళ్లురాని ఈ సినిమాకు 14 కోట్ల కలెక్షన్ వస్తుందా అనేది అందరి అనుమానం. ఏదైమైనా ఈరోజు, రేపు వసూళ్లనే ఫైనల్ అనుకోవాలి. ఎందుకంటే, వచ్చే వారం రాధేశ్యామ్ వస్తోంది. అప్పుడిక శర్వానంద్ సినిమా థియేటర్లు కూడా కోల్పోవాల్సి వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు తొలి రోజు వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి.
Advertisements
నైజాం – 72 లక్షలు
సీడెడ్ – 18 లక్షలు
ఉత్తరాంధ్ర – 20 లక్షలు
ఈస్ట్ – 9 లక్షలు
వెస్ట్ – 8 లక్షలు
గుంటూరు – 12 లక్షలు
కృష్ణా – 11 లక్షలు
నెల్లూరు – 7 లక్షలు