శర్వానంద్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. మార్చి 4, 2022న ఈ చిత్రం థియేటర్స్ లోకి రానుంది. తిరుమల కిషోర్ దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కు సంబంధించి విడుదల అయిన ట్రైలర్, సాంగ్స్, అన్ని కూడా ప్రేక్షకులను ఆకట్టుకోటమే కాకుండా సినిమాపై అంచనాలను పెంచాయి.
ఇక ఇప్పుడు, ఫిబ్రవరి 27న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. అంతే కాకుండా ఈ వేడుకకు జీనియస్ దర్శకుడు సుకుమార్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. అలాగే కీర్తి సురేష్, సాయి పల్లవి కూడా చీఫ్ గెస్ట్ లుగా రాబోతున్నారు.
అలాగే ఈ చిత్రంలో సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్, ఖుష్బు, ఊర్వశి కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
అలాగే ఈ సినిమాతో పాటు అదే రోజు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన సెబాస్టియన్ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాపై మంచి హైప్ నెలకొంది.