శర్వానంద్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్.
ఫిబ్రవరి 25 2022న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఇక ఈ చిత్రంలో ఖుష్భు, ఊర్వశీ, రాధికా శరత్ కుమార్‌లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
ఇక హిట్ ఫ్లాఫ్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు శర్వానంద్. ఇటీవల మహాసముద్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ సినిమాపై ఆశలను పెట్టుకున్నాడు శర్వా.
మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా సినిమా కూడా ఫిబ్రవరి 25న రిలీజ్ కాబోతోంది. మరి చూడాలి ఈ రెండింటిలో ఏ చిత్రం విజయం సాధిస్తుందో.