యంగ్ హీరో శర్వానంద్ సరైన హిట్ కోసం చాలా కాలం వెయిట్ చేస్తున్నాడు. మహానుభావుడు చిత్రం తర్వాత శర్వానంద్ కు మళ్లీ ఆ స్థాయిలో సక్సెస్ దక్కలేదు. ఇటీవల శర్వానంద్ హీరోగా వచ్చిన శ్రీకారం, మహాసముద్రం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.
దీంతో ఈ సారి పక్కా హిట్ కొట్టాలనే కసితో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని ఎంచుకున్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ కు పాజిటివ్ టాక్ రావడంతో పాటు.. సినిమాపై అంచనాలు పెంచేశాయి.
అయితే భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. కొంతమంది బాగుంది అని చెబుతుంటే.. మరికొంతమంది ప్లాప్ మూవీ అంటున్నారు.
కథ విషయానికి వస్తే….ఉమ్మడి కుటుంబం లో పుట్టిన పెళ్లి కాని యువకుడు శర్వానంద్. ఇంట్లో ఎన్నో సంబంధాలు చూస్తారు. కానీ ఏదీ సెట్ కాదు. ఆఖరికి రష్మిక మందన్న శర్వానంద్ లైఫ్ లోకి వస్తుంది. అయితే ఈ ఇద్దరికీ పెళ్లి జరుగుతుందా లేదా ఎలాంటి సంఘటనలు జరుగుతాయి అనేదే ఈ సినిమా కథ.
ఇక ఈ సినిమా బల,బలహీనతలు విషయానికి వస్తే శర్వానంద్ యాక్టింగ్, రష్మిక మందన యాక్టింగ్, రాధిక, ఖుష్బూ, ఊర్వశి ల యాక్టింగ్ ప్లస్ గా చెప్పవచ్చు.
బలహీనతల విషయానికి వస్తే సినిమాలో ఎలాంటి కొత్త ఎలిమెంట్స్ లేవు. ఒక్క పాయింట్ చుట్టూ కథ మొత్తం ఉంటుంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అంతగా ఏమి ఉండదు.
అయితే.. వెన్నెల కిషోర్ కామెడీ సినిమాకు కలిసొచ్చిందని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. మొత్తంగా ఫస్టాఫ్ బాగుందని, సెకండాప్ యావరేజ్ అని చెబుతున్నారు. ఇక తొలివెలుగు రేటింగ్ విషయానికి వస్తే …2.5/5 ఇవ్వొచ్చు.