ప్రస్తుతం టాలీవుడ్ ను ఏలుతున్న అందగత్తెలు రష్మిక, సాయి పల్లవి, కీర్తి సురేష్ అనటంలో సందేహమే లేదు. అయితే ఫిబ్రవరి 25 న శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా రిలీజ్ కాబోతుంది.
ఈ నేపథ్యంలోనే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. శనివారం రాత్రి శిల్ప కళా వేదికలో ఈ ఈవెంట్ జరగనుంది.
ఈ ఈవెంట్ కు సాయి పల్లవి, కీర్తి సురేష్ లు ముఖ్య అతిధిలు గా రాబోతున్నారు. ఈ మేరకు అధికారికంగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మహాసముద్రం సినిమాతో హిట్ కొట్టలేకపోయిన శర్వానంద్ ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు.