యంగ్ హీరో ఆదిసాయికుమార్ రూటు మార్చిన సంగతి తెలిసిందే కదా. ఫార్ములా మూవీస్ తో హిట్ కొట్టలేకపోయిన ఈ హీరో, రీసెంట్ గా కాన్సెప్ట్ మూవీస్ వైపు మళ్లాడు. మంచి పాత్రలు సెలక్ట్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో తనకు సాంగ్స్, స్టెప్స్ లేకపోయినా పట్టించుకోవడం లేదు. అయితే దురదృష్టవశాత్తూ అతడికి ఈ దారి కూడా కలిసిరాలేదు.
అయినప్పటికీ ఆది సాయికుమార్ మాత్రం తన పంథా మార్చుకోలేదు. మనసుకు నచ్చిన కథలతోనే ముందుకెళ్తున్నాడు. తాజాగా మరో సినిమా చేస్తున్నాడు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేకే రాధమోహన్ నిర్మాణంలో ఫణికృష్ణ సిరికి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి టైటిల్ ప్రకటించారు. ఈ చిత్రానికి ‘క్రేజీ ఫెలో’ అనే టైటిల్ ఖారారు చేశారు. ఈ చిత్రంలో ఆది పోషిస్తున్న పాత్రకు తగ్గట్టు ఈ టైటిల్ ని ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్. టైటిల్ కి తగినవిధంగా ఈ చిత్రంలో ఆది విభిన్నమైన పాత్రలో కనిపించనున్నాడు.
పేరుకు ఇది క్రేజీ ఫెలో అయినప్పటికీ, ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయట. పైగా ఇప్పటివరకు ఎవ్వరూ టచ్ చేయని పాయింట్ తో ఇది తెరకెక్కుతోందట. అందుకే ఇందులో నటించడానికి ఆది సాయికుమార్ ఒప్పుకున్నాడు. ఇందులో ఆదికి ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. ఇది కూడా ఆది కెరీర్ కు కొత్త యాంగిల్ తెచ్చిపెట్టింది. దిగంగనా సూర్యవంశీ, మర్నా మీనన్ హీరోయిన్లు.
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు ఆది. క్రేజీ ఫెలో తో పాటు.. సీఎస్ఐ సనాతన్, కిరాతక, అమరన్ ఇన్ ది సిటీ సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. బ్లాక్, జంగిల్ సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి.
We are very much Happy to share our movie name with you all.
⭐ing @AadiSaikumar @DiganganaS @mirnaaofficial
🎞️@SriSathyaSaiArt
🎬@siriki_phani
🎹#RRDhruvan
🎥#SatishMutyala
✂️@GiduturiSatya
💰@KKRadhamohan
🎧@adityamusic
📰@UrsVamsiShekar pic.twitter.com/HLsXGdMuQm— Sri Sathya Sai Arts (@SriSathyaSaiArt) April 8, 2022
Advertisements