ఓం రౌత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆదిపురుష్. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ నటిస్తున్నాడు. అలాగే కృతి సనన్ సీతగా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా నటిస్తున్నాడు.
భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కనివిని ఎరుగని రీతిలో మేకర్స్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
అయితే తాజాగా మేకర్స్ ఓ అప్ డేట్ ని రిలీజ్ చేశారు. మంగళవారం ఉదయం ఏడు గంటల 11 నిమిషాలకు ఓ అనౌన్స్మెంట్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఆ అనౌన్స్మెంట్ ఏంటి అనే దానిపై ఇప్పుడు ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది.
Advertisements
ఇక వీటితో పాటు ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చిత్రం మార్చి 11న రిలీజ్ కాబోతోంది. అలాగే సలార్ షూటింగ్ దశలో ఉంది. అంతేకాకుండా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమా చేయబోతున్నాడు ప్రభాస్.