టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేషు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం మేజర్. ముంబై టెర్రర్ అటాక్స్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అడవి శేషు లీడ్ రోల్ పోషిస్తున్నారు. ఈ టెర్రర్ అటాక్ లో తన ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవితకథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్, మహేష్ బాబు జి.ఎమ్.బి ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీ బ్యానర్ లు కలిసి నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆశక్తికర విషయాలను అడవి శేషు తెలిపారు. సందీప్ ఎంతో కష్టంపై నవ్వు ఆపుకుంటూ ఓ పాస్ పోర్ట్ ఫొటో దిగారట. అయితే సందీప్ అమ్మగారు నన్ను చూసి అచ్చం సందీప్‌లా ఉన్నావన్నారు. దీనికి వారు అంగీకరించాకే సినిమా తీయాలని నిర్ణయించుకున్నా. మహేష్ బాబుగారు, సోనీ పిక్చర్స్ సమకారంతో పాన్ ఇండియా సినిమా తీసయాలని
అనుకున్నామని శేష్ చెప్పుకొచ్చాడు.
మనం చేయాలకున్న పనిమీద నమ్మకం.. ఆ పనిచేసేటప్పుడు మన సిన్సియారిటీ ఈ రెండు మేజర్ సందీప్ లక్షణాలు. ఇవి నమ్ముకుంటే చాలని నమ్మి లుక్ టెస్ట్‌కు వెళ్లానని అడవి శేష్ అన్నాడు. ఇందులో మేజర్ సందీప్ ముఖం సగం, శేషు ముఖం సగం ఉండేలా పాస్ పోర్ట్‌సైజ్ ఫొటోను చూపించారు. ఈ సందర్భంగా మేజర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను వచ్చే నెల 17న విడుదల చేయనున్నామని తెలిపారు.